: బాలయ్య కోసం తరలివచ్చిన చిరంజీవి, వెంకటేష్


నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో వైభవంగా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ హీరో వెంకటేశ్ ఈ కార్యక్రమానికి వచ్చారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులతో పాటు పలువురు రాజకీయ, చలన చిత్ర రంగ ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. వైట్ అండ్ వైట్ డ్రస్ లో మెరిసిపోతూ వచ్చిన బాలయ్య, అందరినీ నవ్వుతూ పలకరించారు. క్రిష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు.

  • Loading...

More Telugu News