: హర్యానాలో తుపాకుల గర్జన!... మార్నింగ్ వాక్ కు వచ్చిన కాంగ్రెస్ నేతను చంపేసిన దుండగులు
హర్యానాలోని రోహ్ తక్ లో నేటి ఉదయం తుపాకులు గర్జించాయి. పొద్దున్నే ప్రశాంతంగా సాగుతున్న మార్నింగ్ వాక్ లో కాల్పులు దడ పుట్టించాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ కాల్పుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేత అశోక్ కాకా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అశోక్ కాకానే టార్గెట్ చేసిన దుండగులు కళ్లు మూసి తెరిచేలోగానే ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మార్నింగ్ వాక్ కు వచ్చిన వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.