: ఒమన్ లో భారత వివాహిత హత్య...12 సార్లు పొడిచి చంపారు
ఒమన్ లో భారతదేశానికి చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే...కేరళకు చెందిన చిక్కురాబర్ట్ కు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. భర్తతో కలిసి ఆమె ఒమన్ లోని దొఫార్ ప్రావిన్స్ లోని సలాలాహ్ నగరంలో గల బదర్ అల్ సమా ఆసుపత్రిలో పని చేస్తోంది. బుధవారం సాయంత్రం పదిగంటల సమయంలో విధుల నుంచి తాము ఉంటున్న అపార్ట్ మెంట్ కు చేరుకున్న ఆమె నేటి ఉదయం విధులకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆసుపత్రికి రావాల్సిన భార్య విధులకు హాజరుకాకపోవడంతో ఇంటికి చేరుకున్న భర్తకు అపార్ట్ మెంట్లో ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన ఒమన్ పోలీసులు, ఆమె గర్భవతి అని, ఆమెను 12 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని నిర్ధారించారు.