: మీ కోసం అహర్నిశలు కష్టపడతా: బాలయ్య
హిందూపురాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సినీ నటుడు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలోని కొడికొండ వద్ద ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. నియోజకవర్గ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చి, సుసంపన్నం చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని ఆయన తెలిపారు.