: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ విచారణకు టీ-సర్కార్ అనుమతి


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని విచారణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2013లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ పై గతంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనను విచారించేందుకు గాను ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత ఏడాది నిర్మల్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో హిందూ దేవుళ్లను, విగ్రహాలను కించపరిచే విధంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి వ్యక్తి బహిరంగ సభల్లో మాట్లాడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News