: 'క్రికెట్ దేవుడు' తన వంతు సాయం అందిస్తున్నాడు: ఫడణవీస్
వర్షాభావం వల్ల మహారాష్ట్రలో తీవ్ర కరవు పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. గుక్కెడు నీళ్ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ 50లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తే, మరో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తీవ్ర కరవు నెలకొన్న రెండు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు వీరి లిస్టులో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం చేరాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పెప్సీకో సంస్థతో కలిసి సచిన్ కరవు ప్రాంతానికి సాయం అందించనున్నట్లు ఫడణవీస్ పేర్కొన్నారు. దీనికోసం సచిన్ తీవ్ర కరవు నెలకొన్న ప్రాంతాల్లో ఒకటైన మరాఠ్వాడాలో కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికను సిద్ధం చేసి తనకు అందించినట్లు తెలిపారు.