: శక్తిమాన్ మృతి విషయంలో సోషల్ మీడియాలో చర్చ.. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా వారికి జత కలిశారు!


పోలీస్ గుర్రం 'శక్తిమాన్' మృతిపట్ల సోషల్ మీడియాలో అసహనం వ్యక్తమయింది. శక్తిమాన్ మృతికి కారణమైన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీని అరెస్టు చేస్తారా? చేయగలరా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మేనకాగాంధీ సోషల్ మీడియా ఆందోళనకారులతో గొంతు కలిపారు. శక్తిమాన్ పోలీస్ అధికారిలాంటిదని పేర్కొన్నారు. శక్తిమాన్ మృతికి కారణమైన గణేష్ జోషీని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనపై జంతు పరిరక్షణ చట్టాలు ఉపయోగించి కేసులు పెట్టాలని ఆమె సూచించారు. అయితే గణేష్ జోషీ మాత్రం శక్తిమాన్ తన కారణంగా మృతి చెందలేదని, మ్యాన్ హోల్ లో పడడం వల్ల కాలు విరిగిందని, దాని వల్లే దాని కాలుకు శస్త్ర చికిత్స చేశారని, దీని కారణంగానే అది మృతి చెందిందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, మార్చి 14న డెహ్రాడూన్ లో బీజేపీ చేసిన ఆందోళన శ్రుతి మించడంతో శక్తిమాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీ శక్తిమాన్ పై విరుచుకుపడ్డారు. పదేపదే దాని కాళ్లపై కొట్టి అది కూలబడేలా చేశారు. దీంతో దాని కాలు విరిగినట్టు మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News