: మరోసారి రూ. 30 వేలకు బంగారం ధర, ఏకంగా రూ. 2,400 పెరిగిన కిలో వెండి ధర!
ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలకు తోడు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న వేళ, బులియన్ మార్కెట్ సైతం అదే దారిలో దూసుకెళ్లింది. నేటి సెషన్లో పది గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 400 పెరిగి రూ. 29,900కు చేరింది. మరోవైపు వెండి ధర ఏకంగా కిలోకు రూ. 2,400 పెరిగి రూ. 40,900కు చేరుకుంది. వివాహాది శుభకార్యాలు జోరుగా జరుగుతుండటంతో ఆభరణాల కొనుగోళ్లు సంతృప్తికరంగా సాగుతున్నాయని, అందువల్లే ట్రేడర్లు, స్టాకిస్టులు ఉత్సాహంగా నూతన కొనుగోళ్లకు దిగుతున్నారని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1.03 శాతం, వెండి ధర 2.72 శాతం పెరిగాయి.