: సృష్టికర్త బ్రహ్మకే బ్రహ్మలు ‘టుస్సాడ్స్’ కళాకారులు: ప్రధాని మోదీ ప్రశంసలు


సృష్టికర్త బ్రహ్మకే బ్రహ్మలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న ఆయన మైనపు విగ్రహాన్ని కళాకారులు రూపొందించారు. మ్యూజియం ప్రతినిధులు రెండు రోజుల క్రితం ఆ మైనపు విగ్రహాన్ని ప్రధాని వద్దకు తీసుకువచ్చి చూపించారు. తన విగ్రహాన్ని చూసుకున్న మోదీ ఆశ్చర్యానికి గురయ్యారని, ఈ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుల గురించి చెప్పడానికి మాటలు రావటం లేదంటూ ప్రధాని ప్రశంసించారని టుస్సాడ్స్ మ్యూజియం ఒక ప్రకటనలో పేర్కొంది. తన విగ్రహం పక్కనే నిలబడి మోదీ ఫొటో దిగారని తెలిపింది. కాగా, ప్రత్యేకంగా మోదీకి చూపించేందుకని ఈ మైనపు విగ్రహాన్ని లండన్ నుంచి ఢిల్లీకి మ్యూజియం ప్రతినిధులు తీసుకువచ్చారు. ఈ నెల 28 నుంచి మోదీ మైనపు విగ్రహాన్ని ప్రదర్శనలో ఉంచనున్నారు. ఈ విగ్రహం తయారీకి నాలుగు నెలల సమయం, రూ.1.5 కోట్లు ఖర్చు అయినట్లు మ్యూజియం ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News