: రోజాకు చుక్కెదురు... అసెంబ్లీయే ఫైనలన్న సుప్రీం
తనను అన్యాయంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారంటూ, సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైకాపా ఎమ్మెల్యే రోజాకు అక్కడ కూడా చుక్కెదురైంది. సస్పెన్షన్ పై తుది నిర్ణయం తీసుకునే హక్కు అసెంబ్లీదేనని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, అసెంబ్లీలో చేసిన పరుష వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని రోజాకు సూచిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అసెంబ్లీకి సూచించింది. ఈ ఉదయం నుంచి రోజా తరఫు న్యాయవాది మూడు గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు వినిపించగా, ఆపై కోర్టు స్పందించి ఈ సూచనలు చేసింది. ఒకవేళ రోజా క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన పక్షంలో ఏం చేయాలన్నది కోర్టు నిర్ణయిస్తుందని వెల్లడించింది.