: ఇక బలపరీక్షకు సిద్ధం కండి: హరీష్ రావత్ కు హైకోర్టు ఆదేశాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ కొనసాగడానికి ఈనెల 29న బలపరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. సభా విశ్వాసం పొందితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ కొనసాగుతారు. రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ హరీష్‌రావత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎమ్ జోసెఫ్, జస్టిస్ వీకే బిస్ట్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.