: ఐ ఫోన్ యూజర్లను ట్రాప్ చేస్తున్న సాధారణ మెసేజ్ లు!
ఐ ఫోన్ యూజర్ల ఖాతా ఐడీ, పాస్ వర్డ్ వివరాలను హ్యాక్ చేస్తోన్న ఒక కుంభకోణం తాజాగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఎన్ బీసీ బే ఏరియా.కామ్ పేర్కొంది. దీని కథనం ప్రకారం, మీ ఐఫోన్ ఐడీ ఎక్స్ పైర్ అయింది.. ఫలానా లింక్ ను క్లిక్ చేయండంటూ ఒక సాధారణ మెసేజ్ ను ఐ ఫోన్ యూజర్లకు హ్యాకర్లు పంపుతున్నారు. ఈ లింక్ ను క్లిక్ చేస్తే కనుక వారి ఐఫోన్ ఖాతా, పాస్ వర్డ్ వివరాలు తస్కరణకు గురవుతాయని ఆ కథనంలో పేర్కొంది. సదరు లింక్ ను క్లిక్ చేసినప్పుడు మన వ్యక్తిగత వివరాలను కూడా అడుగుతుందన్న విషయాన్ని ఎన్ బీసీ బే ఏరియా.కామ్ పేర్కొంది. ఇప్పటికే ఈ తరహా మెసేజ్ లు కొంతమంది ఐఫోన్ వినియోగదారులకు వెళ్లాయని, ఈ విషయమై ఐ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.