: గ్రేట్ మినిస్టర్...ఈసారి ఆకతాయిల నుంచి రక్షించిన సురేష్ ప్రభు


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్టైలేవేరు. ఆయన పనితీరు అద్భుతం అని ప్రతి ఒక్కరూ కొనియాడుతారు. నేరుగా ప్రజా సమస్యలపై ఆయన సూటిగా క్షణాల్లో స్పందించిన విధానం పట్ల దేశ వ్యాప్తంగా అంతా ముగ్ధులవుతున్నారు. తాజాగా ఆయన ఓ ఆకతాయి గుంపు నుంచి దంపతులను రక్షించి శభాష్ అనిపించుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి అజ్మేరీ షరీఫ్-సెల్దాహ్ ఎక్స్ ప్రెస్ లో దంపతులు ప్రయాణిస్తున్నారు. వారు ఎక్కిన బోగీలో కొంత మంది యువకులు కూడా కూర్చున్నారు. వారు ఆ దంపతులను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆ దంపతులు కాన్పూర్, ఆగ్రా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. దీంతో ఆ దంపతులు రైల్వే మంత్రికి ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రైలు ధన్ బాద్ స్టేషన్ కు రాగానే పోలీసులు వచ్చి ఆ దంపతులను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పరారయ్యారు. దీంతో ఆ దంపతులు రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News