: షర్మిల క్యాట్ వాక్.. బాబు మూన్ వాక్!


కొద్దిరోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత షర్మిల క్యాట్ వాక్ చేస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించగా.. నేడు షర్మిల దీటుగా స్పందించారు. బాబు చేస్తోంది పాదయాత్రలా లేదని, ప్రజలతో సంబంధం లేకుండా మూన్ వాక్ చేస్తున్నట్టుందని విమర్శించింది. షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో యాత్ర సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇష్టారీతిగా వాగ్దానాలు చేస్తున్న బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. బాబు పాదయాత్ర కారణంగా 16 మంది పార్టీపై విశ్వాసం కోల్పోయారని షర్మిల ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News