: టీఆర్ఎస్ అంటే... కొత్త పేరు చెప్పిన కేటీఆర్!


తెలంగాణ ప్రజల చిరకాలం వాంఛ... తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించిన పార్టీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే... తెలంగాణ రాష్ట్ర సమితి. మరి ఆ పార్టీ యువనేత, తెలంగాణ మంత్రివర్గంలో కీలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ అన్న పదానికి కొత్త భాష్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును ప్రకటించిన కేసీఆర్... ఆ ఎన్నిక ఇన్ చార్జీగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్టాడిన కేటీఆర్ తన పార్టీ పేరు (టీఆర్ఎస్)ను ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా అభివర్ణించారు. పాలేరు ఉప ఎన్నికలో విపక్షాలన్నీ జట్టు కట్టి బరిలోకి దిగినా, తుమ్మల విజయాన్ని అడ్డుకోలేవని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News