: ‘ఖజానా’లో ఐటీ సోదాలు... నగల వ్యాపారుల గుండెల్లో రైళ్లు
2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్రభుత్వానికి సమర్పించిన ఐటీ రిటర్న్స్ పై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు అవకతవకలు కనిపించిన రిటర్న్స్ పై నిఘా నేత్రం వేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం నగల వ్యాపారంలో పేరెన్నికగన్న ‘ఖజానా జ్యువెల్లర్స్’పై ఆ శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ పరిధిలోని చైతన్యపురిలో ఉన్న ‘ఖజానా జ్యువెల్లర్స్’ శాఖలో ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయపన్ను శాఖ మెరుపు దాడులతో నగల వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.