: నేటి రాత్రి అద్భుతం... గులాబీ రంగులో కనిపించనున్న చంద్రుడు... ఏ పుణ్యం చేసినా వెయ్యి రెట్ల ఫలమట!


వెండి రంగులో తెల్లగా కనిపించే చంద్రుడు, అప్పుడప్పుడు బంగారు వర్ణంలో, అరుదుగా నీలం రంగులో కనిపిస్తాడని అందరికీ తెలిసిందే. ఇక నేడు ఖగోళ అద్భుతంగా చంద్రుడు గులాబీ రంగులో కనిపించనున్నాడు. నేటి రాత్రి 10.54 నుంచి తెల్లవారుఝామున 3.42 వరకూ చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్యుడు మేషరాశిలో, అశ్వనీ నక్షత్రంలో ఉండి 0 నుంచి 15 డిగ్రీల లోపు వంపు కోణంలో సంచరిస్తున్న వేళ చంద్రుడు ఇలా కనిపిస్తాడని తెలిపారు. ఈ సమయంలో ఏ చిన్న పుణ్యం చేసినా వెయ్యి రెట్ల ఫలం లభిస్తుందని అంటున్నారు. కాగా, 2014 ఏప్రిల్ 15న కూడా చంద్రుడు గులాబీ రంగులో కనిపించాడు.

  • Loading...

More Telugu News