: ఓ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది: కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు
పదేళ్ల పాలనలో ఓ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, కృష్ణా నదిని చూస్తే చాలు, వారి పాలన ఏమిటో తెలుస్తుందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్లాది రూపాయలు దోచుకున్నవారు నాయకులుగా చలామణీ అవుతున్నారని, బెయిల్ పై తిరిగే వ్యక్తులు నాయకులా? అంటూ ఆయన ప్రశ్నించారు. వారి అక్రమార్జనకు బెంగళూరు ప్యాలెస్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చని అశోక్ గజపతిరాజు అన్నారు.