: ఆనందంగా జీవించండి... అభిషేక్, ఐశ్వర్యలకు బిగ్ బీ శుభాకాంక్షలు
అభిషేక్, ఐశ్వర్యల వివాహం జరిగి ఈరోజుతో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కొడుకు, కోడలుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తన బ్లాగ్ లో పేర్కొన్నారు. ఈ వివాహంతో వారి మధ్యే కాదు కుటుంబాల మధ్య కూడా ఆత్మీయత, అనుబంధం ఏర్పడిందన్నారు. ఆనందంగా జీవించాలని, ఈ బంధం తర్వాతి తరానికి..ఆ తర్వాతి తరానికి నాంది పలుకుతుందని బిగ్ బీ తన బ్లాగ్ లో కోరుకున్నారు. కాగా, ఏప్రిల్ 20, 2007లో అభిషేక్, ఐశ్వర్వల వివాహం జరిగింది. 2011 నవంబరులో వారికి ఆరాధ్య జన్మించిన విషయం తెలిసిందే.