: రేప‌టి పాలిటెక్నిక్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో మార్పుల్లేవ్‌.. అపోహ‌లు వ‌ద్దు: తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ


ముందుగా నిర్ణ‌యించిన మేరకే తెలంగాణ‌లో రేపు పాలిటెక్నిక్ ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. ప‌రీక్ష‌ల్లో ఎటువంటి మార్పుల్లేవ‌ని రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు సాంకేతిక విద్యాశాఖ డైరెక్ట‌ర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ‌ వ్యాప్తంగా 288 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించ‌నున్న ఈ ప‌రీక్ష‌కు 28 వేల మంది హాజరుకానున్నట్లు తెలిపారు. పది రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామ‌ని వెల్ల‌డించారు. మే నాలుగో వారంలో కౌన్సెలింగ్ ఉంటుంద‌ని చెప్పారు. జూన్ 8నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News