: సెల్ఫీతో ఉద్యోగం ఊడగొట్టించుకుని...తీరిగ్గా బాధపడుతోంది


సోషల్ మీడియాలో ట్రెండ్స్ మోజులో సెల్ఫీలపై వ్యామోహం పెంచుకుంటున్నారు. ఏ పని చేసినా ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, దానికి వచ్చిన లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం అలవాటుగా మారింది. మరి కొందరిలో ఇది వ్యాపకంగా, వ్యసనంగా మారిపోయింది. అలా వ్యసనంగా మారిన మెక్సికో మహిళా పోలీస్ ఏకంగా ఉద్యోగం పోగొట్టుకుని, కుటుంబానికి తలవంపులు తెచ్చానని వాపోతోంది. వివరాల్లోకి వెళ్తే... ఎస్కోబెడోలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న నిదియా గార్సియా అనే మహిళా పోలీస్, పెట్రోలింగ్ నిర్వహిస్తూ యూనిఫాంను తీసేసి ఛాతి భాగం కనిపించేలా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది. అలా పోలీసు ఉన్నతాధికారుల చెంతకు చేరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఆమెను విధుల నుంచి తప్పించారు. అంతే కాకుండా ఆమె ఆ సెల్పీ తీసుకున్న సమయంలో ఆమె పక్కనే సిబ్బంది ఉన్నారా? అన్ని విషయంపై విచారణ మొదలుపెట్టారు. సెల్ఫీ కొంప ముంచడంతో నిదియా తను చేసిన పనిపై పశ్చాత్తాపపడుతోంది. ఇప్పుడు తను చేసిన పని తల్చుకుంటే తనపై తనకే అసహ్యం వేస్తోందని పేర్కొంది. తన ఇద్దరు కుమార్తెలు, భర్త, సోదరులు, కుటుంబ సభ్యులకు చెడ్డపేరు తీసుకువచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News