: అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ లభ్యం... ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో ప్రకటన
అదృశ్యమై రెండేళ్లయినా ఇంతవరకూ ఆచూకీ తెలియని మలేషియా విమానం మిస్టరీ విషయంలో ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో కీలక ప్రకటన చేసింది. గతేడాది మొజాంబిక్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ విమాన శకలాలను సుదీర్ఘంగా పరిశోధించిన ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో, అవి 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి అదృశ్యమైన మలేషియాకు చెందిన ఎంహెచ్ 370 విమానానికి సంబంధించినవేనని పేర్కొంది. పరిశోధనల ఫలితం నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ తిరిగి చేపట్టాలని భావిస్తోంది. అదృశ్యమైన విమానంపై ఇంతవరకూ చేపట్టిన గాలింపు ఎలాంటి సత్ఫలితాలనూ ఇవ్వలేదు. 239 మంది ప్రయాణికులతో మలేషియా ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైంది.