: నా నియోజకవర్గం ప్రజలే నా పెళ్లి చేశారు...అలాంటి ప్రజలకు న్యాయం జరగాలి: బేబీ నాయన


తన నియోజకవర్గం అంటే తనకు కుటుంబంతో సమానమని బొబ్బిలి వైఎస్సార్సీపీ నేత, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బేబీ నాయన తెలిపారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారుతామని చెప్పగానే నియోజకవర్గం మొత్తం తమతో పార్టీ మారేందుకు సిద్ధపడిందని అన్నారు. తమపై ఇంత ప్రేమాభిమానాలు చూపించే నియోజకవర్గ ప్రజలకు ఏం చేసి రుణం తీర్చుకోగలమని ఆయన అన్నారు. తన వివాహానికి కుటుంబ సభ్యులు అక్షింతలు మాత్రమే వేశారని, వాస్తవానికి తన వివాహం చేసింది నియోజకవర్గ ప్రజలని ఆయన అన్నారు. తమపై అంత అభిమానం చూపే ప్రజలకు ఏమీ చేయలేకపోయామని ఆయన చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కారణంగా తమను అభిమానించే గ్రామాల్లో పనులు నిలిపేశారని ఆయన తెలిపారు. వాటన్నింటినీ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News