: బీసీసీఐకి ఊరట!... పుణేలో ఐపీఎల్ మ్యాచ్ లకు బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నిర్వహణకు నీటి కొరత దెబ్బ కొట్టింది. తీవ్ర తాగు నీటి ఎద్దడి ఉంటే... ఐపీఎల్ మ్యాచ్ ల కోసం పిచ్ లను తడిపేందుకు ట్యాంకర్ల కొద్ది నీటిని ఎలా వృతా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బాంబే హైకోర్టు... మహారాష్ట్రలోని పిచ్ లపై మ్యాచ్ లను నిర్వహించరాదని చెప్పింది. ఈ క్రమంలో అప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్ర పరిధిలో జరగాల్సిన మ్యాచ్ లను ఎక్కడికి తరలించాలంటూ బీసీసీఐ అయోమయంలో పడిపోయింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా దృష్టి సారించిన బీసీసీఐకి బాంబే హైకోర్టు ఊరట కలిగేలా తీర్పు చెప్పింది. పుణేలో వచ్చే నెల 1న నిర్వహించాల్సిన మ్యాచ్ ను జరుపుకోవచ్చంటూ కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News