: చిన్నారి చేతికి చిక్కిన 3,200 ఏళ్ల నాటి రక్షా తాయెత్తు... అమూల్యమట!


ఇజ్రాయిల్ కు చెందిన 12 ఏళ్ల నేష్మా స్పిల్ మాన్... తన తల్లిదండ్రులతో కలిసి జరూసలెమ్ లోని ప్రార్థనాలయాల్లో పర్యటిస్తున్న వేళ, 3,200 ఏళ్ల నాటి అత్యంత విలువైన రక్షా తాయత్తు దొరికింది. దీనిపై ఈజిప్టును పాలించిన ఫెరో రాజు తుత్మోస్-3 పేరుండటంతో ఇది వెలకట్టలేనిదిగా మారిపోయింది. "ఒక చోట నేను కూర్చున్నప్పుడు ఓ చిన్న రాయిలా ఇది కనిపించింది. అక్కడున్న మిగతా రాళ్లలా ఇది లేదు. నేను అప్పుడే అనుకున్నా. ఏదో అద్భుతమైనదే నాకు దొరికిందని. ఇక దీని గురించి వివరాలు తెలుసుకున్నాక మరింత ఆనందం వేసింది" అని సంబరంగా చెప్పుకుంది స్పిల్ మాన్. బీసీఈ (బిఫోర్ కామన్ ఏరా) 1479 నుంచి 1425 వరకూ తుత్మోస్-3 ఈజిప్టును పాలించినట్టు చరిత్ర చెబుతోంది.

  • Loading...

More Telugu News