: మిత్రమా!... మీకివే నా బర్త్ డే గ్రీటింగ్స్!: చంద్రబాబుకు ఫోన్ చేసిన మోదీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. నేడు జన్మదినం జరుపుకొంటున్న చంద్రబాబుకు మోదీ బర్త్ డే విషెస్ తెలిపారు. అంతకుముందు తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన మోదీ ఆ తర్వాత ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో శుభాకాంక్షల ట్వీట్ లో చంద్రబాబును మోదీ... తన స్నేహితుడిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేసుకుని పోతున్నారని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్సును ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు కూడా మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News