: బుల్లితెర నటి శిల్పా షిండేపై జీవితకాల నిషేధం


హిందీ బుల్లితెర నటి శిల్పా షిండేపై సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జీవితకాల నిషేధం విధించింది. ‘భాభాజీ ఘర్ పర్ హై’ సీరియల్ తో ప్రజాదరణ పొందిన శిల్పా ఈ విషయమై మాట్లాడుతూ, తానేమీ చూస్తూ ఊరుకోనని, పోరాటం చేస్తానని చెప్పింది. నిర్మాత బెనఫైర్ కోహ్లీ తనను మానసికంగా వేధించారని అందుకే ఆ షో నుంచి తాను తప్పుకున్నానని ఆమె పేర్కొంది. కాగా, 'భాభాజీ ఘర్ పర్ హై' సీరియల్ నుంచి అకస్మాత్తుగా తప్పుకోవాలనుకున్న ఆమె నిర్ణయంపై సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మండిపడుతోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. దీంతో టీవీ సీరియల్స్, షో లలో ఆమె నటించడానికి వీల్లేదంటూ జీవికాలం నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News