: నాకు స్టార్ డమ్ అంటే ఏమిటో తెలియదు!: రకుల్ ప్రీత్ సింగ్
తనకు స్టార్ డమ్ అంటే ఏంటో తెలియదని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఇప్పటికీ స్నేహితులు, సన్నిహితులతో కలసి బయటకు వెళ్లినప్పుడు మామూలుగా ఉంటానని చెప్పింది. సినిమా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు తయారవ్వాలని, స్టైల్ గా ఉండాలని అంటారని, అలా ఉంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. తనకు స్టార్ డమ్ వచ్చిందని తెలియకపోవడమే మంచిదని చెప్పింది. 'ఈ స్టార్ డమ్ వస్తుంది, పోతుంది. ఇది ఉన్నప్పుడు ఉందని మిడిసిపడితే...ఇది పోయిన తరువాత ఇబ్బంది పడాలి' అని చెప్పింది. తనకు స్టార్ డమ్ గురించి తెలియకపోవడమే మంచిదని పేర్కొంది. 'సరైనోడు' సినిమాలో తనతో పాటు కేథరీన్ కూడా నటించిందని, రెండు రోజులు తామిద్దరి కాంబినేషన్ షూట్ చేశారని చెప్పింది. కేథరీన్ చాలా మంచిదని కితాబిచ్చింది. అలాగే ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా నటించారని, అంత స్టైలిష్, అందమైన విలన్ తో నటించడం భలే వుందని చెప్పింది. ఆది అద్భుతంగా నటించాడని చెప్పింది. తన గురించి తాను జడ్జ్ చేసుకోలేనని, ఎవరైనా బాగుందని చెబితే అవునా? అని అనుకుంటానని తెలిపింది. 'సరైనోడు' సినిమా మీ డబ్బులకు న్యాయం చేస్తుందని, కుటుంబ సమేతంగా ధియేటర్ కు వెళ్లి చూడాలని సూచించింది. తెలుగు సినీ ప్రేక్షకులు అందించిన అభిమానం మర్చిపోలేనని పేర్కొంది. ఇంత అభిమానం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.