: చిక్కుల్లో బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ.. పన్ను మినహాయింపు పొందడంపై అభ్యంతరం
బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ చిక్కుల్లో పడింది. ఆమె నిర్వహించిన పలు ఫ్యాషన్ షోలకు పన్ను మినహాయింపు పొందడం పట్ల మహారాష్ట్ర సర్కార్ ఫైర్ అయింది. ఎన్జీవో మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీను ఆమె తండ్రి దివంగత కైఫీ అజ్మీ ఉత్తర ప్రదేశ్లోని అజమ్గఢ్లో స్థాపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్జీవో తరఫున 2011, 2012 సంవత్సరాల్లో మహారాష్ట్రలో నిర్వహించిన రెండు ఫ్యాషన్ షోల్లో వినోదపు పన్ను రద్దు చేయడానికి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. దీనిపట్ల మహరాష్ట్ర సర్కార్ కూడా సదరు ఎన్జీవో పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో దిగివచ్చిన షబనాఅజ్మీ స్పందిస్తూ.. రేపు తాను ఇండియాకు వస్తున్నట్లు తెలిపింది. ఇండియా చేరుకోగానే పన్ను చెల్లించనున్నట్లు చెప్పింది. షబనాఅజ్మీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.