: ప్రపంచంలోనే బెస్ట్ బాడీ బిల్డర్ కోచ్ గా మారిన వేళ!


ప్రపంచంలోని ఏ మూలనున్న దేశంలో జిమ్ కు వెళ్లినా కనిపించే ఫోటో ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ ది. ఆర్నాల్డ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది యువకులు బాడీ బిల్డర్లుగా మారారు. మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న అనంతరం 'కానన్ ది బార్బేరియన్', 'టెర్మినేటర్', 'ప్రిడేటర్', 'కమెండో' వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అలరించారు. అలాంటి వ్యక్తి కోచ్ గా మారి బాడీ బిల్డింగ్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? తాజాగా ఆర్నాల్డ్ తన కుమారుడు జోసెఫ్ ను తన సినీ వారసుడిగా ఎంచుకున్నాడు. దీంతో జోసెఫ్ ను ముందుగా బాడీ బిల్డర్ గా తయారు చేయాలని నిర్ణయించాడు. దీంతో మిస్టర్ యూనివర్స్ పోటీలకు సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగా వెనిస్ లోని గోల్డ్ జిమ్ లో కుమారుడితో ఎక్సర్ సైజులు చేయిస్తున్నాడు. ఈ ఫోటోలు బయటకు రావడంతో జోసెఫ్ ఎంత అదృష్టవంతుడు? అని అంతా పేర్కొంటున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి కాలిఫోర్నియా గవర్నర్ గా పని చేసిన ఆర్నాల్డ్ మరి రాజకీయ వారసుడిగా ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి.

  • Loading...

More Telugu News