: నెల్లూరులోని హోటల్ లో అగ్నిప్రమాదం
నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు ప్రధాన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ శ్రీనివాస భవన్ హోటల్ ఉంది. ఇక్కడ నిత్యం రద్దీ నెలకొని ఉంటుంది. వినియోగదారులకు ఆహారం వండుతున్న క్రమంలో, పెద్ద గిన్నెలోని నూనె పొరపాటును బాయిలర్ పై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాటల్ లోకి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే ఖాళీ చేశారు. క్షణాల్లో వ్యాపించిన మంటలు హోటల్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. స్థానికుల ఫిర్యాదుతో కదిలిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పక్క షాపులకు విస్తరించకుండా చర్యలు చేపడుతున్నారు.