: మధ్యప్రదేశ్ సీఎం కటౌట్ కు గాజులు తొడిగిన మహిళా కాంగ్రెస్ సభ్యులు


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళా కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి ముందు గాజులతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సేకరించిన మూడు లక్షల గాజులను ప్రదర్శనకు ఉంచారు. కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభ ఓఝా, సీనియర్ నేత సురేశ్ పచౌరి, జనరల్ సెక్రటరీ శోభన ఆధ్వర్యంలో ఈ ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. శివరాజ్ సింగ్ కటౌట్ కు గాజులు తొడిగి మరీ, తమ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News