: వెస్టిండీస్ వెనకడుగుతో నిరాశలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్‌లో అడుగు పెట్టాలంటే వరల్డ్ క్రికెట్ బోర్డులు వణికిపోతున్నాయి. పాకిస్థాన్‌లో తరుచూ జరుగుతోన్న ఉగ్ర దాడులు, భద్రతా వైఫల్యం కారణంగా ఆ దేశంలో క్రికెట్ ఆడడానికి క్రికెట్ బోర్డులు ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు తాజాగా వెస్టిండీస్ నిరాకరించింది. వెస్టిండీస్ టీమ్ సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్థాన్ తో యూఏఈలో ఓ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఆ సిరీస్‌లోని కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో ఆడాలని వెస్టిండీస్‌ను పాక్ క్రికెట్ బోర్డ్ అడిగితే, దానికి వెస్టిండీస్ నో చెప్పేసింది. పాక్‌లో తమ జట్టు అడుగుపెట్టడాన్ని నిరాకరించడానికి అక్కడి భద్రతా కారణాలే దీనికి కారణమని తెలిపింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.