: వచ్చే 68 రోజుల్లో భువిపై పెను ఉత్పాతాలు... వీడియో చూడండి!


2016... ఇప్పటికే ఎన్నో ప్రకృతి ప్రకోపాలను చవి చూసింది. జపాన్, ఈక్వెడార్, ఇండియా, ఆఫ్గనిస్థాన్ వంటి దేశాలు భూకంపాలతో వణికిపోయాయి. అమెరికాను మంచు తుపాను కుదేలు చేయగా, ఎడారి దేశమైన సౌదీ అరేబియాను ఎన్నడూ చూడని విధంగా వరదలు ముంచెత్తాయి. ఇక ఈ సంవత్సరం మరిన్ని ఉత్పాతాలు జరగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న వేళ, అదే నిజమవుతుందని జ్యోతిష్యులు సైతం చెబుతున్నారు. వచ్చే 68 రోజులు అంటే... ఏప్రిల్ 20 నుంచి జూన్ 26 వరకూ భూమికి అత్యంత గడ్డు రోజులని వ్యాఖ్యానిస్తున్నారు. విశ్వంలో మారుతున్న గ్రహగతులే ఇందుకు కారణమని విశ్వసిస్తున్నారు. శని గ్రహం, బుధ గ్రహాల కదలికలు భూమికి పెను విపత్తును తేనున్నాయని అంచనా వేస్తున్నారు. వేల సంవత్సరాల తరువాత శని, బుధుడు ఒకే రేఖపైకి రానున్నారని, ఇదే సమయంలో గురు గ్రహం చండాల యోగ కారకుడిగా ఉంటాడని, మరో మూడు గ్రహాలు అశుభ దృష్టితో చూస్తుడటం వల్ల విపత్తులు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి!

  • Loading...

More Telugu News