: మరో వర్సిటీలో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణలు.. ఉద్రిక్తత
శ్రీనగర్ ఎన్‌ఐటీలో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలు పూర్తిగా చల్లారక ముందే.. అక్కడి మరో యూనివర్సిటీలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజౌరి జిల్లాలోని బాబా గులాం షా బాద్షా యూనివర్శిటీలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. రాజౌరిలోని స్థానిక విద్యార్థులు, స్థానికేతర విద్యార్థుల మధ్య ఈ ఘర్షణలు చెలరేగాయి. ఇరు గ్రూపుల విద్యార్థులు పరస్పరం ఒక గ్రూపుపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. పలు వాహనాలను తగులబెట్టారు. గత కొంత కాలంగా ఈ రెండు గ్రూపుల మధ్య వివాదం ఉందని, ఘర్షణలకు కారణం మత కలహాలు కావని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీలో పోలీసు బలగాలను నియమించారు.