: హిమాచల్ ప్రదేశ్ కోతులకు త్వరలో ఫుడ్ స్టేషన్లు


కోతుల బెడద అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ జక్కూ హనుమంత ఆలయం వద్ద కోతులు విపరీతంగా ఉంటాయి. భక్తులను నిరంతరం కనిపెట్టుకుని ఉండే కోతులు, వారి చేతిలోని తినుబండారాలను క్షణాల్లో లాక్కుపోతాయి. కోతులు తమ ఆహారం కోసం మనుషులపై ఆధారపడటంతో వాటి అలవాట్లను మార్చేందుకు వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ ఒక ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో కోతుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది.

  • Loading...

More Telugu News