: రద్దీ సమయాలలో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయం: ఢిల్లీ ‘ఉబర్’


రద్దీ సమయాలలో ఢిల్లీలో వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయమని, వాటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని ప్రముఖ ట్యాక్సీ సర్వీసు సంస్థ ‘ఉబర్’ ఢిల్లీ పేర్కొంది. ఈ మేరకు ఈరోజు ఒక ట్వీట్ చేసింది. తమ సంస్థపై ప్రజలకు విశ్వసనీయత కల్గించే నిమిత్తం ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి నడవాలని తాము కోరుకుంటున్నామని ఆ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ఢిల్లీలో రెండో విడత బేసి-సరి సంఖ్య విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉబర్, ఓలా వంటి యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు ప్రయాణికుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూల్ చేస్తే క్షమించమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటవల తన ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రద్దీ సమాయాల్లో ఉబర్, ఓలా వంటి ట్యాక్సీ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు అందడంతో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యాప్ ఆధారిత ట్యాక్సీలలో ప్రయాణించే ప్రయాణికులకు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ మంత్రి గోపాల్ రాయ్ ఈ మేరకు ఒక విజ్ఞప్తి చేశారు. ఆయా ట్యాక్సీ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కనుక 011-42400400 కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News