: ఢిల్లీ-హైదరాబాద్ మధ్య తిరిగే దత్తాత్రేయకు ఏమి తెలుసు?: మంత్రి నాయిని


తెలంగాణ రాష్ట్రంలో కరవు విషయమై ప్రభుత్వం ఏమి చేస్తోందన్న విషయం ఢిల్లీ-హైదరాబాద్ మధ్య తిరిగే బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఏమి తెలుస్తుందని తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కరవు నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో రాలేదని అన్నారు. తాను రాజ్యసభ రేసులో లేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, రాజ్యసభ రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నెల 27న ఖమ్మం పట్టణంలో ప్లీనరీ జరగనుందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామని నాయిని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News