: డబ్బు వసూలు చేసుకుని బాలుడిని హతమార్చిన కిడ్నాపర్లు


గుంటూరులో అపహరణకు గురైన బాలుడిని కిడ్నాపర్లు హతమార్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు...ఈ నెల 14న యాదిత్యరాజ్ అనే విద్యార్థి ట్యూషన్ కు వెళ్లి వస్తుండగా కిడ్నాపర్లు ఆ బాలుడిని అపహరించుకుపోయారు. బాలుడి తల్లిని బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేసుకున్న కిడ్నాపర్లు, అనంతరం అతన్ని హతమార్చారు. ఫిరంగిపురం మండలం తాళ్లూరు చెరువులో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మృతుడు గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన యాదిత్య రాజ్ గా గుర్తించామన్నారు. తండ్రి లేనందున తల్లితో కలిసి అమ్మమ్మ వద్ద యాదిత్య రాజ్ ఉంటున్నాడన్నారు.

  • Loading...

More Telugu News