: భార‌త బాక్సాఫీసు వ‌ద్ద‌ 'ది జంగిల్ బుక్' రికార్డు


ఏప్రిల్ 8న భారత్ లో విడుద‌లైన హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' ఇక్క‌డి బాక్సాఫీసు వ‌ద్ద‌ రికార్డు నెల‌కొల్పుతోంది. ఇంత‌వ‌ర‌కూ ఏ హాలీవుడ్ చిత్రం కూడా సాధించ‌లేని భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ 'ది జంగిల్ బుక్' దూసుకెళ్తోంది. ఈ చిత్రం భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 100 కోట్ల వ‌సూళ్లను దాటేసింద‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు. సెల‌వు రోజులైన శనివారం, ఆదివారాల్లో వ‌ర‌స‌గా 8.51 కోట్లు, 10.67 కోట్ల రూపాయలు రాబ‌ట్టిన‌ట్లు తెలిపారు. ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్ర‌దర్శితమ‌వుతోంది. సాహసం, వినోదం అంశాలతో ఈ సినిమా కథ కొన‌సాగుతుంది. ఈ చిత్ర హిందీ వర్షన్ కు బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, నానా పటేకర్, ఓం పురి, ఇర్ఫాన్, షేఫాలి షా వాయిస్ ఓవర్ అందించ‌డం ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

  • Loading...

More Telugu News