: మరో అణుపరీక్షకు సిద్ధమైన ఉత్త‌ర కొరియా.. ఎదుర్కొనేందుకు మిల‌ట‌రీ సిద్ధంగా ఉండాల‌ని దక్షిణ కొరియా అధ్య‌క్షురాలు పిలుపు


దూకుడు చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచ దేశాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోన్న ఉత్త‌ర కొరియా మ‌రో అణుపరీక్షకు సై అంటోంది. ఈ విష‌యాన్ని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యున్ హై వెల్ల‌డించారు. ఉత్తర కొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించనున్నట్టు వ‌స్తోన్న వార్త‌ల‌తో ఆ దేశంపై ఐక్య‌రాజ్య‌ స‌మితితో పాటు ప‌లు దేశాలు కఠిన ఆంక్షలు విధించే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌ర కొరియా దూకుడు చ‌ర్య‌ల‌ను సమీక్షిస్తున్నామని పార్క్ గ్యున్ హై తెలిపారు. రెచ్చ‌గొట్టే చర్యలకు పాల్పడుతూ ఉత్త‌ర‌కొరియా సాహ‌సం చేస్తోంద‌ని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ద‌క్షిణ కొరియా మిల‌ట‌రీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News