: 'ఎంతమంది నాన్నలో' అంటూ షారూక్ కొడుకు కేకలు పెట్టిన వేళ!


'ఫ్యాన్'... బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలూ అందగా, బాక్సాపీసు వద్ద దూసుకెళుతోంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన షారూక్ ముద్దుల పుత్రుడు అబ్రామ్, సినిమా పూర్తయ్యేలోగా పలుమార్లు చప్పట్లు కొడుతూ, కేరింతలు పెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా షారూక్ వెల్లడించాడు. డబుల్ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడల్లా "ఇద్దరు నాన్నలు", "ఎంతమంది నాన్నలో" అంటూ కేకలు పెట్టాడట. కానీ, చిత్రం క్లైమాక్స్ చూసిన తరువాత మాత్రం కొంత డిస్టర్బ్ అయ్యాడని, ఆపై సర్దుకున్నాడని చెప్పుకొచ్చాడు. తన కొడుకుకి ఈ సినిమా బాగా నచ్చిందని, మళ్లీ మళ్లీ చూడాలని కోరుతున్నాడని అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ, మురిపెంగా తెలిపాడు.

  • Loading...

More Telugu News