: చనిపోయాడా?... చంపేశారా?: లండన్ లో హైదరాబాదీ మృతిపై అనుమానాలు


బ్రిటన్ రాజధాని లండన్ లో హైదరాబాదుకు చెందిన యువకుడు మీర్ బాఖీర్ అలీ రిజ్వీ మృత్యువాతపడ్డాడు. ఆ మహా నగరంలో రైలు కింద పడి అతడు చనిపోయినట్లు తేలింది. ఈ నెల 12న అతడు చనిపోయినట్లు తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న రిజ్వీ తల్లిదండ్రులు మాత్రం... తమ కొడుకు చనిపోలేదని, చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఆరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కొంతకాలం నుంచి లండన్ లోనే ఉంటున్న రిజ్వీపై గతేడాది కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయాలపాలైన రిజ్వీ... ఓ సారి హైదరాబాదు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తనపై దాడి చేసిన దుండగులపై రిజ్వీ లండన్ కోర్టులో కేసు పెట్టాడు. ఈ కేసును విచారించిన అక్కడి కోర్టు రిజ్వీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రిజ్వీకి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని కూడా కోర్టు దుండగులను ఆదేశించింది. ఈ క్రమంలోనే సదరు దుండగులు తమ కొడుకును చంపేసి ఉండొచ్చని రిజ్వీ తల్లిదండ్రులు వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News