: క్రిస్ గేల్ ఫామ్పై ఆందోళన వద్దు: కోహ్లీ
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్లోనూ తీవ్ర నిరాశపర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మన్ క్రిస్ గేల్‌పై ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. క్రిస్ గేల్ ఆటతీరుపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని చెప్పాడు. తదుపరి మ్యాచుల్లో క్రిస్‌గేల్ రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గేల్ పుంజుకొని సెంచరీ సాధిస్తాడని చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోన్న గేల్.. చివరి ఐదు టీ20 మ్యాచుల్లో కనీసం రెండంకెల స్కోరయినా చేయకుండా వెనుదిరిగాడు.