: కరవు ప్రాంతంలో సెల్ఫీ తీసుకుని విమర్శల పాలైన 'మహా' మంత్రి పంకజా ముండే!


మహారాష్ట్రలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పంకజా ముండే లాతూర్ పర్యటనలో భాగంగా తీసుకున్న సెల్ఫీలు ఆమెపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నాయి. తన పర్యటనలో భాగంగా, కరవు ప్రాంతాల్లో తిరుగుతూ, తీసుకున్న సెల్ఫీలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, నెటిజన్లు ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఎండిపోయిన మంజీరా నది ముందు సెల్ఫీలు దిగడం ఏంటంటూ ప్రశ్నలు గుప్పించారు. ఆమె వైఖరి రైతులను అవమానపరిచేదిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. వీటిని పట్టించుకోని పంకజా ముండే, లాతూరుకు నీటిని అందించేందుకు అన్ని ఏర్పాట్లూ శరవేగంగా సాగుతున్నాయని మరో పోస్టును పెట్టారు.

  • Loading...

More Telugu News