: ప్రపంచంలోనే అత్యంత చెత్త ఉద్యోగాలివి!


ప్రపంచంలోనే అత్యంత చెత్త ఉద్యోగం ఏంటో తెలుసా? ఓ దినపత్రికకు విలేకరిగా పనిచేయడం! యూఎస్ కు చెందిన ఉద్యోగ నియామకాల వెబ్ సైట్ 'కెరీర్ కాస్ట్' దాదాపు 200 రకాల ఉద్యోగాలపై అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేయగా, వరుసగా మూడవ సంవత్సరమూ రిపోర్టర్ ఉద్యోగం అత్యంత చెత్తదని తేలింది. గడచిన దశాబ్దకాలంగా ప్రింట్ మీడియాకు క్రేజ్ తగ్గిందని, వాణిజ్య ప్రకటనలు లేకపోవడంతో ఆ ప్రభావం విలేకరులపై పడుతోందని కెరీర్ కాస్ట్ వెల్లడించింది. ఇక రిపోర్టరు తరువాత, చెదలు, బొద్దింకలను నియంత్రించే పని, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టే ఫైటర్, సైనికుడిగా పనిచేయడం చెత్త ఉద్యోగాల జాబితాలో నిలిచాయి. ఇదే సమయంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, ఆడియాలజిస్ట్, డయాగ్నస్టిక్ మెడికల్ సోనోగ్రాఫర్ ఉద్యోగాలు అత్యుత్తమ ఉద్యోగాల జాబితాలో నిలిచాయి.

  • Loading...

More Telugu News