: బీహార్‌లో కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ బాంబు పేలుడు
బీహార్‌లోని చాప్రా సివిల్ కోర్టు సమీపంలో బాంబు పేలుడు కలకలం రేపింది. పెట్రోల్ బాంబు పేలుడుతో అక్కడి ప్రాంతంలో అలజడి చెలరేగింది. పేలుడులో ఓ మహిళ సహా ఇద్దరికి తీవ్రగాయాలయినట్లు సమాచారం. పేలుడులో గాయపడిన వారిని అక్కడి సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబును పేల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.