: తమ్ముడు టీఆర్ఎస్ లో చేరడాన్ని సహించలేకనే విమర్శలు చేస్తున్నారు!: డీకే అరుణపై తెరాస ఎమ్మెల్యేలు
కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై చిట్టెం రామ్మోహన్ టీఆర్ఎస్ లో చేరితే, దాన్ని సహించలేక డీకే అరుణ అనైతిక విమర్శలకు దిగుతున్నారని తెరాస ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలె కృష్ణారావులు విమర్శించారు. అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది మంత్రి జూపల్లి కృష్ణారావేనని గుర్తు చేసిన వారు, ఆయన్ను కించపరుస్తూ, అహంకార పూరితంగా మాట్లాడటం అరుణకు తగదని అన్నారు. ఆమెకు గద్వాల ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.