: వైసీపీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలోనూ లేదు!... పార్టీ మారే యోచనే లేదంటున్న ఖమ్మం ఎంపీ పొంగులేటి


వైసీపీని వీడే ఉద్దేశం, అవసరం తనకు లేవని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ఆయన ఓ కారణం కూడా చెప్పారు. వైసీపీలో ఉన్నంత స్వేచ్ఛ... మరే పార్టీలోనూ లేదట. ఈ కారణంగానే వైసీపీని వీడే అవసరం తనకు లేదని ఆయన తేల్చేశారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని పార్టీ నేత చండ్ర నరేంద్ర కుమార్ నివాసంలో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ నెల 27న తెలంగాణలో ఏదో జరుగుతోందని, టీఆర్ఎస్ లో వైసీపీ విలీనమవుతోందని దుష్ప్రచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. జిల్లాలో బలం ఉంది. ఇలా తప్పుగా ప్రచారం చేయడం మానుకోవాలి’’ అని ఆయన మీడియాకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News