: కదిరి ఎమ్మెల్యే కూడా జంపా?... చాంద్ బాషాను నిలువరించే యత్నాల్లో విజయసాయి


ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’ విపక్ష వైసీపీని దాదాపుగా ఖాళీ చేసేలానే ఉంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న వైసీపీ అధిష్ఠానానికి షాక్ తగిలే వార్త ఒకటి వినిపించింది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా పార్టీ వీడనున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎప్పటిలానే తనకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను రంగంలోకి దించారు. పార్టీ అధినేత ఆదేశాలతో హుటాహుటిన అనంతపురం వెళ్లిన విజయసాయి, చెవిరెడ్డిలు... చాంద్ బాషాతో భేటీ అయ్యారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చాంద్ బాషా వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News